📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeకోటకోట పాఠశాల అభివృద్ధిలో దూసుకుపోతున్న జలీల్ అహ్మద్.

కోట పాఠశాల అభివృద్ధిలో దూసుకుపోతున్న జలీల్ అహ్మద్.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త మార్చి 15.

కోట ఏవీకేఆర్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ స్థాయి వసతులతో తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తెలిపారు నియోజకవర్గంలో వెనుక బడిన తీర ప్రాంత విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్యను అందించేందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో జలీల్ అహ్మద్ ప్రత్యేక కృషి డిజిటల్ క్లాసులు, ఇండోర్ స్టేడియం,లైబ్రరీ వంటి హంగులతో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చబోతున్న వైనం ఐఐటి నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కోట పాఠశాలను వేదికగా మార్చేందుకు జలీల్ అహ్మద్ సంకల్పం చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ఇంతటి నిబద్ధతతో పనిచేస్తున్న జలీల్ అహ్మద్‌పై కోట మండల ప్రజల అభినందనల జల్లు తాను పుట్టిన గడ్డకు, అక్షరాలు దిద్దిన బడికి రుణం తీర్చుకోవాలనే గొప్ప సంకల్పంతో టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ వేస్తున్న అడుగులు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీ యాంశంగా మారాయి. కోట మండల కేంద్రంలోని అల్లారెడ్డి వెంకట కృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిది ద్దేందుకు ఆయన నడుం బిగించారు. ​కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ బడి సుమారు 79 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కోట హైస్కూల్‌ను, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, అంతర్జాతీయ వసతులతో అభివృద్ధి చేసేందుకు జలీల్ అహ్మద్ ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన విద్యా విప్లవంలో భాగంగా, ప్రతి నియోజక వర్గానికి ఒక మోడల్ స్కూల్ నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పాఠశాలను ఎంపిక చేయించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌ను ప్రత్యేకంగా అభ్యర్థించి, నియోజక వర్గంలోని ఇతర పాఠశాలల కంటే కోట స్కూల్‌ను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసేలా జలీల్ అహ్మద్ విజయం సాధించారు. తీర ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదన్న ఉద్దేశంతో, వారికి అంతర్జాతీయ స్థాయి బోధన అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశo ఈ పాఠశాలలో విశాలమైన ఆటస్థలం,ఇండోర్ స్టేడియం, డిజిటల్ క్లాస్ రూమ్స్ మరియు అత్యాధునిక లైబ్రరీ వంటి సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి లక్ష్యం -IIT&NEET ర్యాంకులు ప్రస్తుతం ఉన్న 500 మంది విద్యార్థుల సంఖ్యను 1500కు పెంచడమే కాకుండా భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన IIT, NEETలలో ఈ పాఠశాల విద్యార్థులు టాపర్లుగా నిలిచేలా శిక్షణ ఇవ్వనున్నట్లు జలీల్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా త్వరలోనే ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడిం చారు. అట్టడుగు స్థాయి నుండి వచ్చిన ఎమ్మెల్యే,తన రాజకీయ భిక్ష పెట్టిన కోట అభివృద్ధికి కట్టుబడి ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. తను ఎదిగిన చోటును మర్చిపోకుండా, భావి తరాల విద్య కోసం ఇంతటి కృషి చేస్తున్న జలీల్ అహ్మద్‌పై స్థానిక ప్రజలు, మేధావులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో MEO దారా మస్తానయ్య, హెచ్ఎం కరుణాకర్ రెడ్డి,స్థానిక నేతలు మరియు ఉపాధ్యాయులు పాల్గొని జలీల్ అహ్మద్‌కు మద్దతు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular