కోట ఉద్యమ వార్త మార్చి 01
కోట మండలంలో టీడీపీకి ఊపు వైసీపీకి షాక్ తగిలింది కోట మండలంలో ఆదివారం భారీ చేరికలు కోట మండలంలో వైసీపీ వికెట్లు డౌన్ సైకిల్ ఎక్కిన వావిళ్ల దరువు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్
పాశిం సునీల్ అభివృద్ధి చూసి వావిళ్లదొరువులో తెలుగుదేశం పార్టీలో చేరినట్టు తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో పసుపు జెండా రెపరెపలు
అభివృద్ధికి జై వైసీపీకి బై బై అంటున్నారని టీడీపీలోకి 50 కుటుంబాల చేరడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ నాయకత్వం అభివృద్ధి సంక్షేమం ప్రజల్లో ప్రభావం చూపుతున్నాయని ఈ చేరికల ద్వారా అర్థమవుతుందని దశరధరామిరెడ్డి అన్నారు రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు వైసీపీని వీడి టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
గూడూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తమవుతుండగా తెలుగుదేశం పార్టీ బలంపుంజుకుంటోందని ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కృషి,అభివృద్ధి పనులకు ఆకర్షితులై భారీ సంఖ్యలో ప్రజలు టీడీపీ వైపు మళ్లుతున్నారని కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వావిళ్ల దొరువు గ్రామం నుండి 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డిపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరినట్లు సదరు కుటుంబాలు తెలిపాయి భారీ చేరికలతో వైసీపీకి వావిళ్ల దొరువుకు చెందిన 50 కుటుంబాలు ఒక్కసారిగా వైసీపీని వీడటం భారీషాక్గా భావిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు కీలక నాయకులు కూడా ఈ చేరికలలో ముఖ్యపాత్ర పోషించారు. నూతనంగా చేరిన కుటుంబాలకు దశధరామిరెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు
కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వాటంబేటీ చెంగల్ రావు,కోట మండల యువత అధ్యక్షులు చల్లా సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ భారీ చేరికతో వావిళ్లదొరువు గ్రామంలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది,ఇది రానున్న ఎన్నికలలో పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.




