కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 15.
కోట పట్టణానికి చెందిన కీ,శే,స్వర్గీయ గూడూరు రాజయ్య కు నివాళులు అర్పించిన నల్లపరెడ్డి జగదీష్ కుమార్ రెడ్డి బుధవారం ఆయన కోట పట్టణం ఆకుతోట వీధి లోని ఉన్న రాజయ్య నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా రాజయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే కుటుంబ సభ్యులు రాజయ్య సతీమణి వజ్రావతమ్మ,కుమారులు గూడూరు రాంబాబు,గూడూరు కృష్ణ,గూడూరు కిరణ్ లకు మనో ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులైన రాజయ్య ఆకస్మిక మరణం కలచివేసిందని ఆయన ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని జగదీశ్ రెడ్డి తెలిపారు రాజయ్య కుటుంబం నల్లపురెడ్ల కుటుంబంతో నడిచారని ఆయన ఎంతో మంచి వాళ్ళని వివాద రహితుడు గా మంచి పేరు తెచ్చుకున్నారని వారి సతీమణిని కూడా క్రియాశీల రాజకీయాలలో రాణించాలని వారి కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారని ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఈ కుటుంబానికి ఏ అవసరం ఉన్న మేము అండగా ఉంటామని నల్లపురెడ్డి జగదీష్ కుమార్ రెడ్డి తెలిపారు,ఆయన వెంట కోట పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ గాది భాస్కర్,నందయ్య తదితరులు ఉన్నారు




