కోట,ఉద్యమ వార్త;ఏప్రిల్ 15.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ని ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కోట మండలం విద్యానగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బందుల రఘురాం అన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బందిల రఘురాం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సునీల్ కుమార్ కు పదవి ఇచ్చిన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువు చేశారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న గూడూరు ఎమ్మెల్యే ఆశీస్సులు కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు నిజమైన ప్రజా నాయకుడికి ప్రజాసేవకాడికి దక్కిన గౌరవంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు నిత్యం గూడూరు నియోజకవర్గ ప్రజలతోనే ఉంటూ ప్రజా క్షేమమే ద్వేయంగా పనిచేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన సునీల్ కుమార్ కి ఇలాంటి పదవులు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సునీల్ కుమార్ ను ఎంపీలు చేసినందుకు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.




