ఉద్యమవార్త- కోట (ఎడిటర్ డాక్టర్. కోటేశ్వరరావు)
🟨18 నెలల్లోనే రూ. 2 కోట్లతో అభివృద్ధి పరుగులు!
🟨అభివృద్ధిపై నెక్స్ట్ టార్గెట్ కోట హరిజనవాడ, నార్త్ గిరిజన కాలనీ అంటున్న జలీల్ అహ్మద్….
🟨ఎస్.కె. జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మారుతున్న కోట పట్టణ ముఖచిత్రం!
🟨ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సహకారంతో రూ. 2 కోట్లతో పనులు
🟨ఎస్సీ రెసిడెన్షియల్ -దళిత బిడ్డల వెళ్లే ప్రధాన రహదారి సుగమం చేసిన జలీల్ అహ్మద్!
🟨40 ఏళ్ల నాటి కల సహకారం – కోటి రూపాయలతో సిసి రోడ్
🟨కోటలో యుద్ధప్రాతిపదికన సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణం
🟨ట్రాఫిక్, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం.
🟨ప్రజా సమస్యలపై, అభివృద్ధి పై జలీల్ అహ్మద్ మార్క్
🟨”నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి” వారి విలువైన సూచనలను పాటిస్తూ
🟨”ఎమ్మెల్యే సునీల్ కుమార్” సహకారంతోనే మారుతున్న అభివృద్ధి రూపురేఖలు అంటున్నా…..
🟨తిరుపతి జిల్లా టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె.జలీల్ అహ్మద్
గత 18 నెలల కాలంలో కోట పట్టణం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. తిరుపతి జిల్లా టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె. జలీల్ అహ్మద్ తనదైన ముద్ర వేస్తూ, కోట పట్టణాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సహకారంతో సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులతో కోటలో మౌలిక సదుపాయాల కల్పన యుద్ధప్రాతిపదికన జరుగుతోంది.
🟨రికార్డు స్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం:
జలీల్ అహ్మద్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిసి రోడ్ల నెట్వర్క్ విస్తరించింది.
🟠శ్యామ సుందర పురం:—
ఇప్పటికే 30 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 10 లక్షల రూపాయల పనులకు జలీల్ అహ్మద్ శ్రీకారం చుట్టారు.
🟠NCR నగర్: —-
14 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం పూర్తి.
🟠శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ:–
10 లక్షల రూపాయలతో సిసి రోడ్లు పూర్తి.
🟠కోటమ్మ గుడి కాలవ గట్టు:–
5 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణం పూర్తి.
🟨భవిష్యత్తు ప్రణాళిక:—-
త్వరలోనే మరో 20 లక్షల రూపాయల వ్యయంతో మరిన్ని సిసి రోడ్ల పనులకు అంకురార్పణ జలీల్ అహ్మద్ చేయనున్నారు.
🟨40 ఏళ్ల నాటి కల సాకారం – కోటి రూపాయలతో భారీ రహదారి:—
🟠దళిత బిడ్డల దారిని సుగమం చేసిన జలీల్ అహ్మద్!
గత నాలుగు దశాబ్దాలుగా ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లే మార్గంలో దళిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న నరకయాతన అంతమైంది. అడవిలా మారిన దారి, ఇరువైపులా ముళ్ళ పొదలు, కంప చెట్లతో కనీసం నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల మధ్య ఇన్నేళ్లు ఆ ప్రాంత ప్రజలు ప్రయాణం సాగించారు.
🔶దశాబ్దాల నిరీక్షణకు తెర:–
గత 40 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని ఈ రహదారి సమస్యను గుర్తించి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు.
🔶కోటి రూపాయల అభివృద్ధి:–
సుమారు కోటి రూపాయల భారీ వ్యయంతో అధునాతనమైన సీసీ (CC) మరియు బీటీ (BT) రోడ్ల నిర్మాణం చేపట్టారు.
🔶సురక్షితమైన ప్రయాణం:–
గతంలో చెట్లు, పొదల మధ్య భయం భయంగా నడిచిన దళిత బిడ్డలు, నేడు నాణ్యమైన రోడ్లపై ధైర్యంగా పాఠశాలలకు చేరుకుంటున్నారు.
సీసీ రోడ్లు ఏర్పాటు చేయించి దశాబ్దాల కాల నాటి కష్టాలను జలీల్ అహ్మద్ తీర్చారు.
🟨ప్రజారోగ్యం – తాగునీరు మరియు ఇతర సౌకర్యాలు:–
🔶తాగునీటి సరఫరా:–
కోటమ్మ గుడి కాలవ గట్టు మరియు గిరిజన కాలనీల్లో రెండు లక్షల రూపాయలతో కొత్త పైపులైన్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను జలీల్ అహ్మద్ పరిష్కరించారు.
🔶చాపల మార్కెట్:—
ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సహకారంతో శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో 2 లక్షల రూపాయలతో అత్యాధునిక చాపల మార్కెట్‌ను జలీల్ అహ్మద్ అందుబాటులోకి తెచ్చారు.
🔶తుఫాను సహాయక చర్యలు: —ఇటీవల వచ్చిన తుఫాను వల్ల దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు 10 లక్షల రూపాయలతో గ్రావిల్ రోడ్లను నిర్మించి ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా జలీల్ అహ్మద్ చేశారు.
🟨ట్రాఫిక్ కష్టాలకు చెక్ – కొత్త కల్వర్టుల నిర్మాణం:–
పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు జలీల్ అహ్మద్ 25 లక్షల రూపాయలతో మూడు కీలక కల్వర్టుల నిర్మాణానికి జలీల్ అహ్మద్ ప్లాన్ చేశారు.
👉🏼రవి నగర్ వద్ద ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు పునర్నిర్మాణం.
🟠👉🏼ఎక్స్ట్రా మార్ట్ పక్కన ఎన్.సి.ఆర్ నగర్ మెయిన్ రోడ్డు కల్వర్టు👇🏽
👉🏼👉🏼ఎన్టీఆర్ నగర్ మెయిన్ రోడ్, ఎక్స్ట్రా మార్ట్ సమీపంలో ఉన్న కల్వర్టు సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గత కొంతకాలంగా ఈ కల్వర్టు ఇరుకుగా ఉండటం, శిథిలావస్థకు చేరడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన జలీల్ అహ్మద్, త్వరలోనే ఇక్కడ నూతన కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు
👉🏼అరుంధతి వాడ నుంచి రవి నగర్ కలిపే కల్వర్టు నిర్మాణం.
🟨ప్రజా సమస్యలపై తక్షణ స్పందన:–
కోట పంచాయతీ పరిధిలో ప్రజలను వేధిస్తున్న కుక్కలు, కోతులు మరియు ఆవుల బెడదకు జలీల్ అహ్మద్ శాశ్వత పరిష్కారం చూపతాము అని వారు తెలిపారు. అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక వ్యాపారస్తులతో సంప్రదింపులు జరుపుతూ త్వరలోనే శాశ్వత మార్పులు జలీల్ అహ్మద్ చేయనున్నారు.
🟨అభివృద్ధిపై నెక్స్ట్ టార్గెట్ కోట హరిజనవాడ, నార్త్ గిరిజన కాలనీ అంటున్న జలీల్ అహ్మద్….
🔶సిమెంట్ రోడ్ల నిర్మాణం: —
ఈ రెండు కాలనీల్లో దెబ్బతిన్న అంతర్గత రహదారుల స్థానంలో కొత్త సీసీ రోడ్ల నిర్మాణం.
🔶మురుగునీటి పారుదల (Drainage): —
వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం.
🔶తాగునీటి సౌకర్యం:–
ప్రతి ఇంటికీ పైపులైన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు.
🔶వీధి దీపాలు:–
కాలనీల్లో భద్రతను పెంపొందించేందుకు కొత్త ఎల్ఈడీ (LED) వీధి దీపాల ఏర్పాటు.
టడపి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె. జలీల్ అహ్మద్ మాట్లాడుతూ...మా అన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారమే బలం!
“మా గూడూరు శాసనసభ్యులు, మన అన్న పాశం సునీల్ కుమార్ సహకారంతోనే కోట ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని అన్నారు.⭐”నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి”⭐
వారి విలువైన సూచనలను పాటిస్తూ….పట్టణ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, సునీల్ అన్న అండతో కోటను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను అని వారు స్థానిక ప్రజలకు మాట ఇస్తున్న అని తెలిపారు.”




