కోట,ఉద్యమవార్త మార్చి 28.
కోట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ రథం కార్యక్రమం జరిగింది వ్యర్ధాలు నిత్యవసరాలు తీసుకోండి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీవో నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ రథం ప్రారంభించింది
ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ రథం కు పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లు,కవర్లు, ప్యాకెట్లు,గాజు సీసాలు,పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు,నూనె డబ్బాలు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు,ఇనుము, స్టీల్, అల్యూమినియం తదితర వస్తువులు ఇవ్వవచ్చు అని వ్యర్ధాలనుతూకం వేసి అందుకు సమానమైన నగదు లెక్కించి సరిపడా నిత్యావసర సరకులు ఇస్తారు సబ్బులు, టూత్‌పేస్టులు, ఉల్లిపాయలు వంటి 20 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి ప్రతి గ్రామంలో 25 రోజులకు వెళ్ళేలా ప్రణాళిక రూపొందించారు స్వచ్ఛ రథం మీ ఇంటి ముందుకు వస్తే వ్యర్థాలివ్వండి నిత్యావసరాలు తీసుకోండి గ్రామాలు పరిశుభ్రంగా మారటం,వ్యర్థాలకు నిత్యావసరాలు ఇంటి వద్దే లభిస్తాయి వాహనదారుడుకి ఉపాధి లభిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీపీ మరియు వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటకృష్ణారెడ్డి కోట మండల సోషల్ మీడియా అధ్యక్షులు మధుబాబు తల్లం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




