కోట ఉద్యమ వార్త మార్చి 27.
కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గోవిందపల్లి పాలెం సీతారాముల స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా శ్రీశ్రీశ్రీ తూర్పు కనుపూరు దేవస్థానం చైర్మన్
శ్రీ చిల్లకూరు దశరధరామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవిందపల్లి పాళెం లోని సీతారాముల దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా
ప్రత్యేక పూజలు నిర్వహించారు, దశరధ రామిరెడ్డిని గ్రామ కాపులు
గ్రామస్థులు ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానం చేసి,తీర్ధ ప్రసాదాలు అంద చేశారు,ఈ సందర్భంగా దశధర రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గోవిందపల్లి పాలెం లోని ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారని భారతదేశానికి ఆరాధ్య దైవం శ్రీరాముడు తండ్రి మాట జవదాటిని వాడు భరతఖండానికి మహారాజు అటువంటి మహనీయుని వేడుకలను అందరూ జరుపుకోవాలని అలాగే శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు చెల్లా సురేష్ బాబు టిడిపి సీనియర్ నాయకులు చంగల్ రావు గ్రామ కాపులు ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




