📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్"మత్స్యకారులలో భరోసా నింపడానికే జగనన్న రాక - కాకాణి"

“మత్స్యకారులలో భరోసా నింపడానికే జగనన్న రాక – కాకాణి”

📰 Generate e-Paper Clip

నెల్లూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 14.

మత్స్యకారులలో భరోసా నింపడానికే జగనన్న వస్తున్నారని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం జువ్వల దిన్నెలో రేపు జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం,కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి , నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి,ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మిగిలిపోయిన 10 శాతం నిలిపివేశారుమత్స్యకారుల పక్షాన ఎల్లవేళలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందిఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణపై మత్స్యకారులు కూటమి ప్రభుత్వం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని సమస్య వచ్చినప్పుడు మంత్రులకు, అధికారులకు మత్స్యకారులు గుర్తుకు వస్తున్నారా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలకు, పెట్టుబడులకు వ్యతిరేకం కాదు,  ప్రైవేటీకరణకు మాత్రమే వ్యతిరేకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు మత్స్యకారుల కష్ట,నష్టాలను తెలుసుకుని,వారికి అండగా నిలవడమే జగన లక్ష్యం
మత్స్యకారుల హక్కులను కాపాడటంలో జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మత్స్యకారుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్‌ నిర్మాణం చేపట్టారుజగన్ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి ప్రారంభోత్సవానికి కూడా తేదీ ఖరారైంది,ఈలోపు ఎన్నికల కోడ్ రావడం ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయికొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేసిందిహార్బర్‌లోని కొంత భాగాన్ని (దాదాపు 29.5 ఎకరాల తీర ప్రాంతాన్ని) సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడం మత్స్యకారుల కడుపు కొట్టడమేమొదటి దశలోనే మత్స్యకారులకు స్థలం సరిపోక ఇబ్బందులు పడ్డారు,దాన్ని విస్తరించాల్సింది పోయి,ఉన్న హార్బర్‌ను ప్రైవేట్ పరడం చేయడం మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారుకూటమి ప్రభుత్వం ​మత్స్యకారుల ప్రయోజనాలను పక్కన పెట్టి, బలవంతంగా ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం
మత్స్యకారుల ప్రయోజనాలను పణంగా పెడుతూ, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది
మత్స్యకారుల ప్రయోజనాలను ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టి, ఇప్పుడు వారిపై ప్రేమ ఉన్నట్లు కూటమి ప్రభుత్వం నటిస్తోందినారా లోకేష్ ఇటీవల జువ్వల దిన్నె లో పర్యటించి,శంకుస్థాపన చేసిన రోజే మత్స్యకారుల ప్రాణాలకు తెగించి పట్టకొచ్చిన   నాలుగు కరైకల్ బోట్లను పంపించేయాలని ఆదేశించడం, పంపించి వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల జోక్యంతోనే బోట్లు తరలి వెళ్లాయికూటమి ప్రభుత్వం మొక్కుబడిగా ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ గురించి,బోట్ల తరలింపు విషయంలో కూడా మొక్కుబడిగా వ్యవహరిస్తూ, మత్స్యకారులను మభ్యపెట్టాలని చూస్తున్నారు
మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతుంటే మంత్రులు గానీ, అధికారులు గానీ,గతంలో వారి సమస్యలను పట్టించుకోలేదు, మత్స్యకారుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది,కాబట్టి వారు జీర్ణించుకోలేకపోతున్నారు జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మించి మత్స్యకారుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దే నని.తానే నిర్మించానంటూ క్రెడిట్ చోరీకి పాల్పడడం  చంద్రబాబు నాయుడు కి అలవాటే ప్రజలు అన్ని గమనిస్తున్నారుశాసనమండలి సభ్యులు తలశిల రఘురాం,కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,మరోక మాజీ శాసన సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరం కలిసి పర్యవేక్షిస్తున్నాం మత్స్యకారులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రేపు (బుధవారం) జువ్వల దిన్నెలో పర్యటించనున్నారు రేపు ఉదయం 9:45 గంటలకు జగన్ హెలికాప్టర్ ద్వారా చేరుకుని, నేరుగా ఫిషింగ్ హార్బర్‌ను సందర్శిస్తారు,ఉదయం 11 గంటలకు మత్స్యకారులతోముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారుమధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రయాణమవుతారుజగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలన్న స్పందన కనిపిస్తుంది, మత్స్యకారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి కి సమస్యలు తెలిపేందుకు ఉత్సాహం చూపుతున్నారుజగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నా, లేకపోయినా,తాను ప్రజల పక్షమేనని జువ్వలదిన్నె పర్యటనతో మరొకసారి రుజువైంది ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular