📄 ePaper
Saturday, June 13, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్రాధా కృష్ణ మీద చర్యలు తీసుకోవాలి గ్రీవెన్స్ డే లో పిర్యాదు-కాకాణి గోవర్ధన్ రెడ్డి.

రాధా కృష్ణ మీద చర్యలు తీసుకోవాలి గ్రీవెన్స్ డే లో పిర్యాదు-కాకాణి గోవర్ధన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

నెల్లూరు, ఉద్యమ వార్త; ఏప్రిల్ 27.

నెల్లూరు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఫిర్యాదులు సమర్పించినా,ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేయకుండా, పిర్యాదులు పట్టించుకోకుండా, పక్కన పెట్టిన వైనాన్ని ప్రశ్నించి, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరడానికి శాసన మండల సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి వైయస్సార్సీపి నాయకులతో కలిసి నెల్లూరు ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్ డే లో పిర్యాదు చేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణ తన కొత్త పలుకు కార్యక్రమం లో వాడిన రోత భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందిరాధాకృష్ణపై మేము ఇచ్చిన పిర్యాదు ల పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాధాకృష్ణను వెనకేసుకొస్తున్నాడు 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు,తన పాలనలో ప్రజలకు చేసింది శూన్యం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మావిగన్ అనగానే తట్టుకోలేక వ్యక్తిగతంగా దూషణలకు దిగాడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తో పాటు మరికొందరి నాయకుల పై అక్రమంగా కేసులు నమోదు చేశారురాధాకృష్ణ పై పెట్టిన కేసులలో విచారణ ఎంత వరకు జరిపారో తెలుసుకుందామని గ్రీవెన్స్ కు వస్తే ఎస్పీ,అడిషనల్ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న డీఎస్పీ కి వినతి పత్రం అందజేశాం, డీఎస్పీ మెసేజ్ వస్తుందని తెలిపారు మెసేజ్ తో సరిపెడతారా దీని మీద విచారణ చేస్తారా చూడాలి మేము ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళం,ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అవసరమైతే రెండోసారి, మూడోసారి కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం
పోలీసుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది,పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారుతోంది
టోల్ ప్లాజా వద్ద అధికార కూటమి పార్టీ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి వాహనాన్ని అడ్డుకుని,అద్దాలు పగలగొట్టి,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిబ్బందిపై దాడి చేయడం దారుణం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు గన్ మెన్ లు రక్షణగా ఉండేవారే తప్ప, ఎవరిపై చేయి చేసుకునేవారు కాదు కానీ ఇప్పుడు కూటమి శాసన సభ్యుల గన్ మెన్ లు వ్యవహరిస్తున్న తీరుఅభ్యంతరకరంగా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మా పార్టీకివెన్నెముక,వారి ధైర్యమే పార్టీకి అసలైన ఆస్తి
పోలీసులు ఒక పక్క కేసులు పెడుతున్నా, హింసిస్తున్నా,జైళ్లకు పంపిస్తున్నాఏమాత్రం భయపడకుండా పార్టీ కోసం పోరాడుతున్న నాయకులు,కార్యకర్తలు ఉండటం వైఎస్సార్ సీపీ కి గర్వకారణం
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది భారీ సంఖ్యలో ఇక్కడకి తరలివచ్చిన ప్రతి కార్యకర్తకు,మీడియా మిత్రులకు పేరుపేరునాకృతజ్ఞతలు తెలుపుతున్నా
కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసే శక్తులపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular