📄 ePaper
Saturday, June 13, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్వివాదాస్పద భూమిలో టెంకాయల కోతకు పోలీస్ రక్షణ కోరిన మహిళ

వివాదాస్పద భూమిలో టెంకాయల కోతకు పోలీస్ రక్షణ కోరిన మహిళ

📰 Generate e-Paper Clip

తోటపల్లి గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 19.

మండలంలోని పేడూరు రెవెన్యూ పరిధిలోని చింతోపు గ్రామానికి చెందిన కైలాసం వరలక్ష్మి, తమ కుటుంబానికి సంబంధించిన భూమిలో టెంకాయలు కోయుటకు పోలీస్ రక్షణ కల్పించాలని కోరుతూ ఆదివారం తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్‌లో అర్జీ సమర్పించారు. కుటుంబ సభ్యుల మధ్య భూమి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో చెట్లపై సిద్ధంగా ఉన్న టెంకాయలు పాడైపోయే అవకాశం ఉందని ఆమె అర్జీలో పేర్కొన్నారు.ఇటీవల టెంకాయలు కోయించేందుకు ప్రయత్నించిన సమయంలో అడ్డంకులు ఎదురయ్యాయని, ఈ విషయంపై తన కుమార్తెలు అభ్యంతరం వ్యక్తం చేశారని వరలక్ష్మి ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాను వెళ్లే రోజున ఎలాంటి అంతరాయం లేకుండా కోత పనులు నిర్వహించేందుకు పోలీస్ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెలవులో ఉండడంతో అర్జీని అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. అర్జీపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ వివాదానికి సంబంధించిన అంశాలు సంబంధిత అధికారుల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular