📄 ePaper
Saturday, April 18, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్తోటపల్లి గూడూరులో మొదలైన జనగణన శిక్షణ-సందర్శించిన జిల్లా టీమ్

తోటపల్లి గూడూరులో మొదలైన జనగణన శిక్షణ-సందర్శించిన జిల్లా టీమ్

📰 Generate e-Paper Clip

తోటపల్లి గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 15.

తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో జనగణన 2027 కు సంబంధించి గణకులకు శిక్షణా తరగతులు తోటపల్లి గూడూరు ఎంపీడీవో కార్యాలయంలో నేడు మొదలైనవి. మూడు బ్యాచ్ లుగా జరుగనున్న ఈ శిక్షణను ఛార్జ్ అధికారి మండల తహశీల్దార్ సుధీర్ మరియు అదనపు ఛార్జ్ అధికారి ఎంపీడీవో వెంకటేశ్వర రావులు నేడు ప్రారంభించారు.42 మంది గణకులు, 5గురు పర్యవేక్షకులతో కూడిన మొదటి బ్యాచ్ కు సురేష్, భాస్కర్ లు ఫీల్డ్ ట్రైనర్ లుగా వ్యవహరిస్తున్నారు. మండలంలో మొత్తం 98 మంది సచివాలయ సిబ్బంది గణకులుగా,15 మంది మండల స్థాయి అధికారులు పర్యవేక్షకులుగా తొలిదశ జనగణన అయిన ఇండ్లగణనలో పాల్గొంటున్నారు. ఒకో బ్యాచ్ కు 3 రోజులపాటు శిక్షణ ఇచ్చేలా మొత్తం 3 బ్యాచ్ లుగా వీరిని విభజించారు.నేడు మెదలైన తొలి బ్యాచ్ కు శిక్షణ జరుగుతున్న సమయంలో శ్రీయుత జిల్లా కలెక్టరు ఆదేశాలతో స్పెషల్ టీమ్ ఆకస్మికంగా వచ్చి శిక్షణా విధానాన్ని మరియు ఏర్పాట్లను పరిశీలించారు.జిల్లా టీమ్ లో ఎస్ వి శ్యాం కుమార్,ఏ ఆశోక్ వర్ధన్,ఎస్ రాహుల్ తదితరులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular