📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా దర్బార్ ప్రజలకు ఎంతో ఉపయోగం-సునీల్ కుమార్.

ప్రజా దర్బార్ ప్రజలకు ఎంతో ఉపయోగం-సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

గూడూరు ఉద్యమ వార్త ఏప్రిల్ 11.

కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు శనివారం గూడూరు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు తెలియపరిచారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు త్వరగా తీర్చేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ఈ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పరిష్కారం చూపే విధంగా ప్రయత్నించాలని ఆయన కోరారు అలాగే అధికారులందరూ వారి వారి శాఖల యందు పనితీరును మెరుగుపరచుకోవాలని ఆయన కోరారు ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని కింది స్థాయిలో కూడా అంతే కష్టపడి అందరూ పని చేస్తే ఎమ్మెల్యేగా నాకు ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన అన్నారు తుఫాన్లు టైంలో దెబ్బతిన్న చెరువులు కాలువలు మరమ్మత్తుల విషయంలో ఇరిగేషన్ శాఖ పనితీరు మెరుగుపరచుకోవాలని ఆయన తెలిపారు పోలీస్ శాఖ వారు గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో బాగా పని చేస్తున్నారని ఆయన అన్నారు పనిచేసే మంచి కలెక్టర్ తమకున్నారని కాబట్టి ప్రజా సంక్షేమం ప్రజల సమస్యలు తీర్చడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఆయన తెలిపారు ఇప్పటివరకు జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో ప్రజలు ఇచ్చిన అర్జీలు వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular