📄 ePaper
Monday, June 15, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే-సునీల్ కుమార్.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే-సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

గూడూరు ఉద్యమ వార్త ఏప్రిల్ 11.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి కుల వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి విగ్రహాలకి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలేచేసిన సేవలకు మహాత్మ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారిని స్మరించుకోవడం మన బాధ్యత వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన లక్ష్యం వెనుకబడిన తరగతుల వారు తలెత్తుకుని తిరిగేందుకు ఆయన చేసిన కృషి ఆయనను ఒక మహానుభావుడుగా మహాత్మాగా పేరు తెచ్చుకున్నారు కుల వ్యవస్థ కులాలలో ఆధిపత్య పోరు మూఢనమ్మకాల నిర్మూలన లక్ష్యంగా ఆయన పనిచేశారని సునీల్ కుమార్ తెలిపారు తాను కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారిని పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిగా నాకు నియోజకవర్గంలో పేరు ఉందని పేద ప్రజలు భూములను ప్రభుత్వ అసైన్డ్ భూములను కొందరు పెత్తందారులు అనధికారికంగా స్వాధీనం చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని కుల సంఘాలు ప్రజా సంఘాలు నిజాయితీగా పేద ప్రజల కోసం వారి హక్కుల కోసం పనిచేయాలని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతీస్తుందని ఇప్పటికే వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని ఆయన తెలిపారు మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా రాష్ట్రానికి మహోన్నత సేవలు అందించారని ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular