అనంతపురం జిల్లా,ఉద్యమ వార్త; ఏప్రిల్ 10.
అనంతపురం జిల్లా లో రాయలసీమ సాగు నీటి ప్రాజెక్ట్ లు,సమాలోచన కార్యక్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతపై మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షత శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య తిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా”కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూరాయలసీమ ప్రయోజనాలే మా ప్రాధాన్యతరైతుల సంక్షేమమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయంరాయలసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు కుట్ర చేశాడు”రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకున్నానని తెలంగాణ సీఎం చెబుతుంటే,చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి జయించే వరం పొందిన వ్యక్తి చంద్రబాబుచంద్రబాబు రైతుల సంక్షేమం కంటే, స్కామ్‌లకే ప్రాధాన్యత ఇస్తాడుగతంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం పేరుతో భారీగా టిడిపి నాయకులు దోచుకున్నారుచంద్రబాబు ‘మిషన్’ అంటేనే ‘కమీషన్’చంద్రబాబు నీటి భద్రత- సాగునీటి సంఘాల ప్రాధాన్యత,పేరిట సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టాడు
చంద్రబాబు రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం తప్ప,రైతు ప్రయోజనాల్ని ఏరోజు పట్టించుకోలేదుకాకాణి స్క్రోలింగ్ పాయింట్స్ రైతు తలచుకుంటే ఏదైనా సాధించగలడు, పండించగలడు,కానీ సాగునీరు అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చే వనరు, దానిని ఒడిసి పట్టుకోవడం, నిల్వచేయడం, రైతాంగానికి అందించడం ప్రభుత్వాల బాధ్యతవిత్తనాలు,ఎరువులు రైతు స్వయంగా తెచ్చుకోగలడు కష్టపడి పంట పండించగలడు, కానీ సాగునీరు మరియు గిట్టుబాటు ధర అనేవి ప్రభుత్వాల అండతోనే సాధ్యమవుతాయిఆంధ్ర రాష్ట్రంలో రైతు గురించి గానీ, వ్యవసాయం గురించి గానీ,నీటి వనరుల గురించి గానీ, మాట్లాడాలంటే రాజశేఖర్ రెడ్డి కి ముందు,రాజశేఖర్ రెడ్డి యుగం,రాజశేఖర్ రెడ్డి తర్వాత అని మూడు భాగాలుగా విభజించవచ్చు అన్నారుస్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు,అందుకే నేటికీ రైతులు తాము పండించే ప్రతి గింజలోనూ ఆయన చిరునవ్వును చూసుకుంటున్నారురాజశేఖర్ రెడ్డి తర్వాత, మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు,మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రైతుల కష్టాలను గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారురాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టారుదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచి సీమకు అండగా నిలిచారు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు తెచ్చుకుంటే, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం,నెల్లూరు జిల్లాలకు సమృద్ధిగా నీరు అందుతుందని ఆలోచన చేశారు800 వందల అడుగుల దిగువ నుంచే దాదాపు 8 టీఎంసీల నీరు పాలమూరు-రంగారెడ్డి, దిండి,తదితర ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ,నీటిని తోడుకుంటుందికూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపివేశారుతెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకున్నానని చెప్పడం చుస్తే,చంద్రబాబు నైజానికి ఇదో నిదర్శనంతెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాజెక్టును ఆపేయడానికి చంద్రబాబు సహకరించడం సిగ్గుచేటుఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఘటనతో తేలిపోయిందని కాకాణితెలిపారు. రాయలసీమతో పాటు నెల్లూరు,ప్రకాశం జిల్లాలకు సమృద్ధిగా నీరు అందే ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు తీరని అన్యాయం చేశాడు- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ప్రయత్నించాడు,
ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు మాకు తాకట్టు పెట్టాడని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించాడుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా చంద్రబాబు కనీసం స్పందించడం లేదు, ఖండించే పరిస్థితుల్లో కూడా లేడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల గురించి మాట్లాడితే, చంద్రబాబు అవహేళనగా మాట్లాడుతున్నాడు20 టీఎంసీల నీళ్లు పోతే ఏమవుతుందని చంద్రబాబు అనడం రైతుల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం
మీ ఇంటి పక్కన ఎవడైనా ఐదు సెంట్ల భూమి ఆక్రమిస్తే ఊరుకుంటారా? మరి రైతుల నీటి విషయంలో చంద్రబాబు కు ఎందుకు ఇంత నిర్లక్ష్యం?”అర్థం కావడం లేదుఅధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవసాయాన్ని, రైతులను ఏరోజూ పట్టించుకోలేదు, ఆయనకు వ్యవసాయం అంటే అశ్రద్ధ, రైతులు అంటే అసహ్యంతెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో గొంతెత్తి తెలంగాణ వాళ్లు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు, అడ్డుకోండని అప్పట్లో హెచ్చరించినా, చంద్రబాబు నాయుడు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కొని, రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయి వచ్చాడుచంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం రైతుల సాగునీటి వనరులకు రక్షణ ఉండదు,చంద్రబాబు కేవలం తన స్వలాభం కోసమే చూస్తాడు
చంద్రబాబు గత జన్మలో ఘోరమైన తపస్సు చేసి, భగవంతుడి దగ్గర అసహ్యాన్ని జయించే వరాన్ని పొందాడు చంద్రబాబు ఏది మాట్లాడినా ప్రజలకు అసహ్యం కలిగేలా ఉంటుంది నేనే హైదరాబాద్‌ను కట్టాను,కంప్యూటర్‌ను నేనే కనిపెట్టాను, తుపాను రాకుండా అడ్డుకున్నాను”అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం హైదరాబాద్‌ను నిర్మించిన కులీ కుతుబ్ షా ఆత్మ ఈ మాటలు వింటే ఏమవుతుందో ఆలోచించాలి, చంద్రబాబు వాస్తవాలకు పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు అంతా తానే చేశానని భ్రమ కల్పిస్తాడు,ఎవరో చేసిన కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు
రాష్ట్ర ప్రజల గురించి లేదా రైతుల సంక్షేమం గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచన చేయలేదు చంద్రబాబుకు రైతుల కష్టాల కంటే, వారి పేరుతో స్కామ్‌లు చేయడమే ఎక్కువ తెలుసుగతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యానికి మంచి ధర లభిస్తే, అది ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిందని చంద్రబాబు అన్నాడుకూటమి పాలన లో ధాన్యం ధరలు తగ్గితే ఇరాన్ యుద్ధం వల్ల ధరలు తగ్గాయని సాకు చూపుతున్నారు
చంద్రబాబుకు రైతులు ఎప్పుడు గుర్తుకు వస్తారంటే ఏదైనా స్కీమ్ పేరుతో స్కామ్ చేయాలనుకున్నప్పుడే రైతులు గుర్తుకొస్తారు తాజాగా చంద్రబాబు ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు,ఇది కూడా పాత దోపిడీ పర్వంలో భాగమే
రైతుల గురించి చంద్రబాబుకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు,కేవలం తన వారికి దోచిపెట్టడమే ఆయన ధ్యేయంనిబంధనలకు విరుద్ధంగా జీవోలు విడుదల చేసి, తమ అనుకూల వ్యక్తులతో వాటర్ యూసర్ అసోసియేషన్లను నామినేట్ చేశాడు ఎటువంటి పారదర్శకత లేకుండా పనులు కట్టబెట్టి,రైతులకు మేలు చేయడం కంటే కార్యకర్తల జేబులు నింపడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఏదైనా మిషన్ అన్నాడంటే,అందులో కమీషన్ ఉంటే తప్ప ఆ జోలికి వెళ్లడు పోలవరంను సోమవారం అని కాలయాపన చేశాడు,ఇప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నాడు అమరావతి పేరిట రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పిలుపునిచ్చిన ర్యాలీలకు ప్రజల నుండి స్పందన కరువైంది
ప్రతి మండలంలోనూ జనం రాక టీడీపీ నేతలు ఇబ్బంది పడ్డారు
సర్వే పల్లి నియోజకవర్గంలో కనీసం 20 మోటార్ బైకులు కూడా రాలేదు
జగన్ మోహన్ రెడ్డి మావిగన్ కి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబులో వణుకు మొదలైంది ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మానుకోవాలిరాయలసీమ నీటి ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు తాకట్టు పెడుతున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి పనిచేసిందిజగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, చంద్రబాబు నాయుడు వాటిల్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చాడు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పధకం విషయంలో చంద్రబాబు నాయుడు దోబూచులాడుతున్నాడు,దీనివల్ల రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల రైతులకు సాగు మరియు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి
చంద్రబాబు రైతులను అమాయకులుగా భావిస్తున్నాడు,రైతులందరూ సంఘటితమై ఈ అన్యాయంప పోరాడాలి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి, చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండ కడతాం చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల రాయలసీమ, ప్రకాశం నెల్లూరు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై దీర్ఘకాలిక కార్యాచరణతో పార్టీలకతీతంగా రైతు సంఘాల నాయకులతో కలిసపోరాడతాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను సాధించుకునే వరకు విశ్రమించబోము అని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.




