కోట,ఉద్యమవార్త;ఏప్రిల్ 02.
మేజర్ పంచాయతీ కోట పట్టణంలో విద్యుత్ శాఖలో సిబ్బంది లోపంతో భారం అంతా లైన్మెన్ వేసవికాలం దృష్టిలో పెట్టుకొని గురువారం కోట పంచాయతీలోని అన్ని ట్రాన్స్ఫార్మర్ లకి అడుగు భాగంలో వాటర్ ట్యాంకర్లతో నీటిని తడిపే కార్యక్రమం కోట పంచాయత లైన్మెన్ కరిముల్లా నిర్వహించారు వేసవికాలం వేడి ఎక్కువ అవ్వడంతో ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు మేజర్ పంచాయతీ కోటలో ఎక్కువగా విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయని కానీ సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు ఇబ్బందులు ఎన్ని ఉన్నా వినియోగదారుల ఇబ్బంది పడకూడదని ఉన్న అరకొర ఇబ్బందితోనే వీలైనంతవరకు విద్యుత్ సమస్యలు రాకుండా ఉండేందుకే తమ ప్రయత్నమని లైన్మెన్ కరిముల్లా తెలిపారు. ఇంత పెద్ద మేజర్ పంచాయతీ కోటలో తరచుగా చెట్లు వలన రకరకాల కారణాల వలన విద్యుత్ సమస్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తగినంత సిబ్బంది లేకపోవడం ఉన్న సిబ్బందితోనే ఇబ్బందులు పడుతున్న ఈ సమస్యను గమనించి అధికారులు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోటి పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు.




