📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్నిరుపేదలకు అండగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి-అల్లం రమణయ్య

నిరుపేదలకు అండగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి-అల్లం రమణయ్య

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త మార్చి 18.

సేవే మార్గం నిరుపేదలే లక్ష్యంగా మా సంస్థ శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు అల్లం రమణయ్య తెలిపారు బుధవారం వారి సంస్థ ఆధ్వర్యంలో పల్లమూరి నిర్మలమ్మ అనే పేద మహిళ కుటుంబానికి వారి జీవనాధారం ఉపయోగపడేలా కుట్టు మిషన్ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెప్పేవారు కావున దాతల సహాయంతో నిరుపేదలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తూ మా సంస్థ ముందుకు వెళ్తుందని అదేవిధంగా నెల్లూరుకు చెందిన దువ్వూరు నగేష్ రెడ్డి దాతృత్వంతో 11000 విలువచేసే కుట్టుమిషన్ ని నిర్మలమ్మ కుటుంబానికి అందించమని తద్వారా వారి కుటుంబ జీవనానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు నిర్మలమ్మ మాట్లాడుతూ తమది నిరుపేద కుటుంబమని తనకు వికలాంగురాలైన కుమార్తె కూడా ఉందని అల్లం రమణయ్య తమకు ఇచ్చిన కుట్టు మిషన్ ద్వారా కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటామని వారికి మరియు దాతకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను శ్రీ శిరిడి సాయి అక్షయ సేవా సమితి ఎన్నో సంవత్సరాలుగా ఇప్పటికే వేల మంది పేదలకు తమ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు అందించారు నిరంతరాయంగా సేవలందిస్తున్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సంస్థకు అల్లం రమణయ్యకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular