📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా రేపు గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా.

ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా రేపు గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త మార్చి18

కోట పట్టణంలో రేపు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చేతుల మీదగా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం జరుగుతుందని గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు షేక్ నౌషాద్ బాషా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరిగే ఈ కార్యక్రమంలో
కోట,వాకాడు,చిట్టమూరు మండలాలకు చెందిన 600ల కుటుంబాలకు రంజాన్ తోఫా కోట పట్టణంలోని కోటమ్మ గుడి బైపాస్ రోడ్డులో SKB ఆవరణలో ఈభారీ సేవ కార్యక్రమం నిర్వహించబడుతుందని రంజాన్ తోఫా  మూడు మండలాల పేద ముస్లింలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు అలాగే
జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ సహకారంతో ప్రతి సంవత్సరం జరుగుతున్న రంజాన్ తోఫా మానవత్వమే ఊపిరిగా మంచితనమే ప్రాణంగా పేద ప్రజలే మార్గంగా నిరంతరం సేవా మార్గంలో గ్రీన్ ఫౌండేషన్ పయనిస్తుందని ఆయన అన్నారు ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సేవలో ప్రజల పక్షాన గ్రీన్ ఫౌండేషన్ అండగా నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మా ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ వస్తున్నారని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular