గూడూరు ఉద్యమ వార్త మార్చ్ 16.
గూడూరు పట్టణం త్యాగజీవి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ తెలిపారు అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి వేడుకలలో భాగంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నందున్న పొట్టి శ్రీరాములు విగ్రహం కు ఆయన ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుడు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన అమరజీవికి గుర్తుగా కూటమి ప్రభుత్వం అమరావతి నందు 6.8 ఎకరాలలో స్మృతివనం,58అడుగులకాంస్యవిగ్రహంనువారికిప్రాణత్యాగానికిగుర్తుగాఏర్టు చేసిందనిడాక్టర్ పాశిం సునీల్ కుమార్ చెప్పారు
ఈ భూమి మీద ఎంతోమంది పుడుతుంటారు కానీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసమే పుట్టారని ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగం ప్రపంచంలోనే తెలుగు వారంతా గుర్తుపెట్టుకోవాలని ఇటువంటి మహానుభావుల్ని స్మరించుకోవడం ఎంతో అవసరం అని ఆయన త్యాగం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని సునీల్ కుమార్ తెలిపారు ఆయన త్యాగానికి గుర్తుగా అమరావతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మన అందరి అదృష్టం అనే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రపంచంలోని తెలుగు వారంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




