కోట ఉద్యమ వార్త మార్చి 16
కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని కోట మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు సోమవారం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ఏర్పాటు కు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూతిమ్మనాయుడుపాలెం పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తామని ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని గ్రామ అభివృద్ధి మా లక్ష్యం అని తిమ్మనాయుడుపాలెంలో మిగిలిన రోడ్లు కూడా త్వరలో పూర్తి చేస్తామని మారం రెడ్డి శ్రీధర్ రెడ్డితెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ప్రజల పక్షపాతి మా ప్రియతమ నేత గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.తిమ్మనాయుడు పాలెం గ్రామస్తులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ మరియు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో సిమెంట్ రోడ్ నిర్మాణం ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని రోడ్డు వేయడంతో తిమ్మనాయుడుపాలెం గ్రామం ప్రజలు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారుఈ కార్యక్రమంలో తిమ్మనాయుడు పాలెం బూత్ కన్వీనర్ మర్రి నాగభూషణం,గ్రామ కమిటీ అధ్యక్షులు నాగేళ్ల గురునాథం మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




