📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్3వరోజు 28 వ డివిజన్ మన కార్పొరేటర్ మన ఇంటికి.

3వరోజు 28 వ డివిజన్ మన కార్పొరేటర్ మన ఇంటికి.

📰 Generate e-Paper Clip

నెల్లూరురూరల్,,ఉద్యమవార్త;ఏప్రిల్. 03,

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ 28వ డివిజన్ లోని నిప్పో
కాలనీ లో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులుకోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్ఫూర్తితో “మన కార్పొరేటర్ మన ఇంటికి” 3వరోజు ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు వారి వారి సమస్యలను చెప్పుకునేందుకు విలువ ప్రతిరోజు వారి ఇంటి వద్దకే వెళ్లి వారితో మమేకమై సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశం గా కార్పొరేటర్ మన ఇంటికి అనే మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని దీనివల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అయినా కూడా ఇంకా ఇంకా ప్రజలకు సేవ చేయాలనే నిరంతరం భావిస్తుంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సోపాల ప్రసాద్,శ్రీనివాసులు నాయుడు,తులసి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular