📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్సర్వేపల్లిలో 57 మందికి రూ.75 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ సాయం

సర్వేపల్లిలో 57 మందికి రూ.75 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ సాయం

📰 Generate e-Paper Clip

తోటపల్లి గూడూరు,ఏప్రిల్ 7;ఉద్యమ వార్త.

సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 57 మంది లబ్ధిదారులకు రూ.75 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం అందజేశారు. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 760 మందికి రూ.7.22 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా స్పందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ.100 కోట్ల చొప్పున పేదలకు సహాయం అందుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి సేవలకు ప్రజలంతా రుణపడి ఉన్నారని అన్నారు.తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరుచింతోపు, ముంగలదొరువు, గూడూరు, చిన్న చెరుకూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొణతం రఘుబాబు, ప్రధాన కార్యదర్శి మన్నెం జితేంద్ర గౌడ్, సాగునీటి సంఘ అధ్యక్షులు గుడ్లూరు గోపాల్ నాయుడు, మధుసూదన్ గౌడ్, మొగిలిగుంట పోతన, చుక్కపల్లి మల్లికార్జున్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular