📄 ePaper
Wednesday, April 22, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రమాదంలో మృతి చెందిన రఫీ కుటుంబానికి ఆర్థిక సాయం.

ప్రమాదంలో మృతి చెందిన రఫీ కుటుంబానికి ఆర్థిక సాయం.

📰 Generate e-Paper Clip

తోటపల్లి గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 9.

తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆములూరు గ్రామ పంచాయతీకి చెందిన షేక్ రఫీ కొద్ది రోజులు ముందు జరిగిన దురదృష్టకరమైన బైక్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘటనను యువగళం పాదయాత్ర సమయంలో స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా మంత్రి నారా లోకేష్ కి తెలియజేశారు.ఈ నేపథ్యంలో రఫీ కుటుంబానికి సహాయం అందించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా మన ప్రియ నాయకులుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులతో,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిన గోపాల్ నాయుడు ఆధ్వర్యంలో,చుక్కపల్లి మల్లికార్జున చౌదరి కృషితో ఆర్థిక సహాయం అందజేశారు.గురువారం అల్లిపురంలో ఉన్న శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో రఫీ కుటుంబ సభ్యులకు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సాయం అందజేయబడింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని రఫీ కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.స్థానికంగా ఈ సహాయం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular