📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్నియోజకవర్గంలో దాదాపు21 అంగన్వాడీ పోస్టుల- పాసిం సునీల్ కుమార్

నియోజకవర్గంలో దాదాపు21 అంగన్వాడీ పోస్టుల- పాసిం సునీల్ కుమార్

📰 Generate e-Paper Clip

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు నియోజకవర్గంలో దాదాపు 21 అంగన్వాడీ పోస్టులు ఇచ్చామని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు,చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్
తెలిపారు ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికీ, చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎన్నికలలో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందిఅధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ
కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటిసౌకర్యాలుమరుగుదొడ్లనిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టిందని అలాగే 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు,బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75కోట్ల వ్యయంతో 5G స్మార్ట్‌ఫోన్లు అందించడం ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతున్నాయి అంగన్వాడీ కేంద్రాల హాజరు 70 శాతం నుంచి 96 శాతానికి పెరగడం కూటమి పాలనకు వచ్చిన ప్రత్యక్ష ఫలితమని చెప్పారు ఏళ్లతరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ కలను కూటమి ప్రభుత్వం నిజం చేసింది గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లోనే రూ.20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్వాడీలకు అండగా నిలిచిందని
అంగన్వాడీ సెంటర్ కు TV, RO లు, టాయిలెట్ సౌకర్యం, టీచర్లు, ఆయాలకు వేసవిలో 15 రోజులు సెలవులు,ఆటవస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్టులు, ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంట పాత్రలు ఇచ్చామని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తోంది ఇందులో భాగంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి కల్పించి,పూర్తి స్థాయి వేతనాలు అందించనుంది అలాగే కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనుందనిఅంగన్వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వంపరిష్కరించింది వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తోంది ప్రతినెల ఒకటో తేదీననే వేతనాలు చెల్లిస్తూ,ఉద్యోగుకు భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంనియోజవర్గంలో దాదాపుగా 21 అంగన్వాడీ పోస్ట్ లు ఇచ్చాం గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దివాళ తీసి వెళ్ళింది.వారు చేసిన అప్పులకు రాష్ట్రానికి వస్తున్న ఆదాయంతో పాటు ఇంకా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని సునీల్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular