గూడూరు ఉద్యమ వార్త మార్చి 12.
గూడూరు రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం 3 వ విడత శుక్రవారం గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చేతుల మీద రైతుల కి అందిస్తున్నారు.అగ్రికల్చర్ అధికారుల వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత రెండువిడతల్లో రూ.6.309 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.ఈరోజు 3 విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడుదల 46.85 లక్షల మంది కి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో రూ.6000/- జమ చేయనుంది. మూడో విడతగా 2.676 ఓట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయనున్నాయి ఇందులో రాష్ట్రం వాటా1.874 కోట్లు. ఇప్పటికే ఒక రైతుకు 14000 ప్రభుత్వం అందించింది శుక్రవారం ఇచ్చే 6000/- తో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి 20,000/- పూర్తవుతుంది.




