కోట,ఉద్యమ వార్త;మే 1.
ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పెడలభరోసా పెంక్షన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోట పట్టణం లో జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు
గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా!! పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేసి అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం చూడడం జరిగినది,ప్రతినెల ఒకటవ తేదీన పింఛను ఉదయం 11 గంటల్లోపు దాదాపు పింఛని ప్రక్రియ పూర్తవుతుంది 4 వేల రూపాయలు, 6 వేలు రూపాయలు, 10 వేలరూపాయలు, 15వేలురూపాయలు,
చొప్పున లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందిస్తుందని ఆయన తెలిపారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అవ్వా తాతలకు,ఒంటరి మహిళలు, దివ్యాంగులు,ఇబ్బంది పడకుండా, నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దే జరుగుతున్న పెన్షన్ల పంపిణీ ప్రజా సేవలో ఎప్పుడు ముందు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది అసలైన ప్రజా ప్రభుత్వం ప్రతినెల క్రమం తప్పకుండా పింఛన్ సచివాలయం సిబ్బంది అందిస్తున్నారు పెన్షన్ అర్హులందరికీ కూటమి ప్రభుత్వం అందిస్తుందని జలీల్ అహ్మద్ తెలిపారు ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డా!!తిరుమల శెట్టి కోటేశ్వరరావు, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి సిద్దపరెడ్డి పోలమ్మ,కోట మండల సోషల్ మీడియా అధ్యక్షులు మీజూరు మధుబాబు,కోట మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఎంబేటి రూపేష్,సచివాలయం సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.




