📄 ePaper
Thursday, June 18, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్అభివృద్ధి,సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం-సునీల్ కుమార్

అభివృద్ధి,సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం-సునీల్ కుమార్

📰 Generate e-Paper Clip

ఉద్యమ వార్త,గూడూరు ఏప్రిల్ 01: గూడూరు.

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం అని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తెలిపారు బుధవారం ఆయన
మండలంలోని మంగళపూరు పంచాయతీ బీసీ,ఎస్టీ కాలనీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్లనుప్రారంభించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఈ రోడ్ల నిర్మాణంముఖ్యమైనదని,బీసీ, ఎస్సీ,ఎస్టీ కాలనీ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, కూటమి ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తుందని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పంచాయతీ అధికారులు,ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular