వాకాడు, ఉద్యమ వార్త; మే 13.
వాకాడు మండలంలోని ప్రసిద్ధ శ్రీ పట్టాభిరామాలయంలో హనుమజ్జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి సుప్రభాత సేవ,విష్వక్సేన ఆరాధన,పుణ్యాహవాచనం,కళశ స్థాపన,చతుర్దశ కళశ స్నపన,సహస్ర నాగవళ్ళీ దళార్చన,సింధూరార్చనలు జరిగాయి.స్వామివారికి ద్వాదశ ఆరాధన, ప్రాకారోత్సవంలో ద్వాదశప్రదక్షిణలు జరిగాయి. ఉభయకర్తలుగా వాకాడు సాయి కృష్ణ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీస్ అధినేతల పుట్టం వేంకటేశ్వర్లు రెడ్డి,అనూరాధ,డాక్టర్ సాయి కౌశిక్ రెడ్డి,శ్రీవాణి దంపతులు వ్యవహరించారు.ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు దీవి అనంతబాబు శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.నరేష్ శర్మ,నాగేంద్ర శర్మ,కోన సాయిబాబు తదితరులు స్వామివారి పూజలు నిర్వహించారు.ఆలయ ధర్మకర్తలు కొడవలూరు దామోదరరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.కార్యక్రమంలో శ్రీరామసేన సభ్యులు హరీష్ రెడ్డి.శివకుమార్,సిద్దయ్య,తేజ,వినయ్, పవన్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు*




