నాయుడుపేట, ఉద్యమ వార్త; ఏప్రిల్ 23.
నాయుడుపేట మండలం గొట్టిప్రోలు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపాల్ పి రవీంద్రయ్య తెలిపారు.ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ 3వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 40 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లకు కేవలం ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ అవకాశాన్నీ అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆసక్తి గల వారు వివరాలకు 9491435025 లేదా 9010486964 నంబర్లను సంప్రదించాలని లేదా నేరుగా గొట్టిపోలు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కి నేరుగా వచ్చి అప్లై చేసుకోవచ్చు అని చదువు విద్యార్థుల భవిష్యతు అని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతస్థాయి కి వెళ్లేందుకు చదువు ఒక్కటే మార్గం అని ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశం ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.




