📄 ePaper
Wednesday, April 22, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్జగనన్న కాలనీలను కాదు,ఊళ్ళు నిర్మించాడు - కాకాణి గోవర్ధన్ రెడ్డి.

జగనన్న కాలనీలను కాదు,ఊళ్ళు నిర్మించాడు – కాకాణి గోవర్ధన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

సర్వేపల్లి, ఉద్యమ వార్త; ఏప్రిల్ 21.

సర్వేపల్లి జగనన్న కాలనీలను కాదు,ఊళ్ళు నిర్మించాడని తెలిపిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి.మంగళవారం వెంకటాచలం పంచాయతీ పరిధిలో నిర్మించిన జగనన్న కాలనీని వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు, స్థానికులతో కలిసి జగనన్న కాలనీ – చంద్రబాబు కహానీ పేరుతో ఇంటి ఇంటికి తిరిగి జగనన్న హయాంలో నిర్మించిన ఇళ్లను పరిశీలించి,సొంత ఇంటి కల నెరవేరిందని కాలనీవాసులతో సంతోషాన్ని పంచుకున్న మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పనిచేశారని పేర్కొన్న కాకాణి
జగన్ మోహన్ రెడ్డి పేదల కోసం నిర్మించిన కాలనీల విషయం లో చంద్రబాబు అబద్ధపు కథలు చెబుతున్నాడు”జగనన్న గృహం చంద్రబాబు ద్రోహం” పేరిట జగన్ ఇళ్లు నిర్మిస్తే వాటిని పూర్తి చేయకుండా చంద్రబాబు అడ్డుకున్న విధానాన్ని ప్రజలకు తెలియ చెబుతాం జగనన్న హయాంలో “ఇళ్లు కాదు ఊళ్లు నిర్మించాం అని చెప్పడమే కాకుండా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు ప్రజలకు తెలియ చెబుతున్నాం 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం అనేక విన్నపాలు చేసుకున్నా,కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు ఇక్కడ నివసించే గిరిజనులు,పేదలు అనేక ఇబ్బందులు పడుతూ, సరైన వసతులు లేక చెట్ల క్రింద జీవిస్తూ, అనారోగ్యాల పాలవుతూ నరకయాతన అనుభవించారు
నెల్లూరుకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవాలని చూసినా,వాటిని అడ్డుకుని పేదలకు దక్కేలా చేశాం
మొదటి విడతలో 7 ఎకరాల స్థలాన్ని సేకరించి దాదాపు 260 ప్లాట్లను పేదలకు పంపిణీ చేశాం పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తుంటే నాడు ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  ఓర్వలేకపోయాడు,ఇది దేవాదాయ శాఖ భూమి అంటూ కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకోవాలని చూశాడు పేదవానికి మంచి జరగాలని భావించి ​అన్ని అడ్డంకులను, న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఈరోజు ఒక అందమైన ఊరినే నిర్మించి పేదల ఆత్మసంతృప్తికి కారణమయ్యాము చెన్నై-నెల్లూరు హైవే జాతీయ రహదారి పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలో ఒక్కో పేదవాడికి దాదాపు 9 అంకణాల స్థలాన్ని కేటాయించాం దాదాపు రూ. ఒక్కొక్కరికి 10 లక్షల విలువైన స్థలాన్ని జగనన్న ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చింది గిరిజన కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయం​వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని పేద గిరిజన (ఎస్టీ), ఎరుకల కుటుంబాలకు గృహ నిర్మాణంలో వెన్నుదన్నుగా నిలిచాం ప్రభుత్వం ఇచ్చే సాధారణ నిధులతో పాటు, సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా అదనంగా ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు నేరుగా కలెక్టర్ ఖాతా నుండి లబ్ధిదారులకు అందించాం
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి విద్యుత్ మీటర్లు,వైరింగ్ సౌకర్యం కల్పించాం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత ఐదేళ్లలో పేద ప్రజల ఆశలను నిజం చేస్తూ,వారికి సొంత ఇంటి కలని నెరవేర్చింది
భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, పేదల ఇళ్ల కోసం సుమారు ఒక లక్ష ఎకరాల భూమిని కేటాయించాం.72,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించాం మరో 26,000 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం భారీ వ్యయంతో కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేసిందని.కేవలం గృహ నిర్మాణ రంగంపైనే జగన్ ప్రభుత్వం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసింది
అందులో స్థలాల విలువ ₹50,000 కోట్లు కాగా, నిర్మాణానికి మరో ₹50,000 కోట్లు వెచ్చించాం గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నా ఒక్క ఇళ్ళు నిర్మించి ఇవ్వకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి నిర్మించి ఇచ్చిన ఇళ్లను  తాము నిర్మించామని చెప్పుకొని  ‘ప్లైవుడ్ నమూనా తాళాలు’ఇచ్చి నాటకాలు ఆడారు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న కాలనీలో కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లను పేదలకు అందించారు చంద్రబాబు హయాంలో గతంలో 365 చదరపు అడుగులకు రూ. 50,000 డిపాజిట్ కట్టాల్సి ఉండగా, జగన ప్రభుత్వం అందులో 50% రాయితీ ఇచ్చి కేవలం రూ. 25,000 లకే రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది చంద్రబాబు  అమరావతి పేరుతో కేవలం కాలయాపన చేస్తున్నాడు పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ది అద్భుతం,ఈ రోజు లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే దానికి నిదర్శనం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో  నిర్మించిన ఇళ్లను, స్థలాలను మీడియా సమక్షలో చూపిస్తాం, ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం కూటమి నాయకులు సిద్ధం గా ఉన్నారా సవాల్ విసురుతున్నాకాకిలా కలకాలం బ్రతకడం కంటే, హంసలా ఆరు నెలలు బ్రతకడం మేలు,చంద్రబాబు ఎన్ని ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా పేదలకు చేసిందేమీ లేదు జగన్ ఐదేళ్లలోనే తన ముద్ర వేశాడు జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు, లబ్ధిదారులు కోరుకుంటున్నారని ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ వారికోసం పోరాడుతామని కాకాణి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular