📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రపంచ మేధావికి ఘన నివాళి - జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి.

ప్రపంచ మేధావికి ఘన నివాళి – జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

 కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 14.

కోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనంగా నివాళి అర్పించిన జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి.భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనంగా 135వ జయంతి వేడుకలు జరుపుకోవడం మన అందరి బాధ్యత అని భారతరత్న,రాజ్యాంగ నిర్మాత, భావితరాల భవిత, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అణగారిన వర్గాలకు దిక్సూచి, తరాలు మారిన ఆయన పేరు చెరగని ముద్రగా ప్రజలలో ముద్ర వేసుకున్న మహనీయులు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అంబేద్కర్ అని మోహన్ రెడ్డి అన్నారు 135వ జయంతి కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు నేడు భారతదేశంలో ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నత చదువులు చదువుకొని అత్యున్నత శిఖరాలలో వారి వారి రంగాల్లో రాణిస్తున్నారంటే కారణం అంబేద్కర్ అని అలాంటి మహనీయుడి జయంతిని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంటుందని అంబేద్కర్ లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular