📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్"శ్రీ గాయత్రి లో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు"

“శ్రీ గాయత్రి లో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు”

📰 Generate e-Paper Clip

గూడూరు,ఉద్యమవార్త; ఏప్రిల్ 5.

గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు యూకేజీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.చిన్నారులు యూకేజీ విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రైమరీకి అడుగుపెట్టిన సందర్భంగా సర్టిఫికెట్స్ మరియు మెమొంటోలతో ఘనంగా సత్కరించారు.
గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా అలరించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కె.పి.ప్రసాద్ రావు మాట్లాడుతూ విద్యార్థులకి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం అభినందనీయమని, చిన్నారులు భవిష్యత్తులో అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి వినూత్నంగా ఆలోచిస్తూ విద్యార్థుల విజయమే పరమావధిగా ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ కృషి చేస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, హరిత, గీతిక,మాధవి, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular