కోట ఉద్యమ వార్త మార్చి 31.
కోట మండల కేంద్రంలోని వెంకన్నపాలెం పంచాయతీ లో మంగళవారం సివిల్ రైట్స్ డే నిర్వహించారు ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాలతో గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సహాయ సహకారలతో వెంకన్నపాళెం గ్రామంలో ఎస్సి,ఎస్సి లకు వారికున్న హక్కులపై కోట ఎమ్మెరో, ఎంపీడీఓ,సచివాలయ సిబ్బందితో కలిసి అవగాహన సధస్సు పెట్టడం జరిగింది.ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా వెంకన్నపాళెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్ పాల్గొనడం జరిగింది
ఈ సదస్సు ముఖ్యఉద్దేశం ప్రభుత్వాలు ఎస్సి,ఎస్టీ లకు ప్రవేశ పెట్టే పథకాలు అందుతున్నాయా లేదా గ్రామంలో కులాల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా,వారి జీవన విధానం లో వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే దానిపై సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశం లో కొంత మంది గ్రామ ప్రజలు వారి వారి సమస్యలు చెప్పడం జరిగింది ఎమ్మెరో మరియు ఎంపిడివో స్పందించి మీ నాయకుల సహాయ సహకారాలతో మీ సమస్యలు పరిష్కరిస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది అలాగే బిజెపి నాయకులు పనబాక కోటేశ్వర్రావు మాట్లాడుతూ వెంకన్నపాళెం గ్రామం లో ఎన్నో సంవత్సరాలుగా సైడు కాలువల సమస్య ఈ ఎస్సి,ఎస్టీ కాలనీలో ఎక్కువ గా వుంది అలాగే ఈ డ్రైనేజ్ వాటర్ పోవడానికి పంట కాలువ ఉండేది ఇప్పుడు అది ఆక్రమణకు గురై వుంది ఆ కాలువను పునః ప్రారంభిస్తే మరల ఈ డ్రైనేజి సమస్య కు పరిష్కారం జరుగుతుంది. అలాగే ఎస్సి,ఎస్టీ లకు ఒక్కరికి కూడా వ్యవసాయ భూమి లేదు ప్రభుత్వ భూమి వున్న చోట వీరికి భూమిని కల్పిస్తే వీళ్ళు కూడా వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తారని అధికారులకు తెలియజేయడం జరిగింది.అలాగే వెంకన్నపాలెం పంచాయతీ కోకర్ల మధు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో ఎప్పుడూ ఇలాంటి సభలు పెట్టడం ప్రజా సమస్యలు తీర్చడం ఎస్సి,ఎస్టీ లకు వున్న హక్కుల పై సధస్సు పెట్టి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేసిన దాఖలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఇలాంటి కార్య క్రమాలు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ వుంది.మన గ్రామం లో ఎవరికీ ఏ సమస్య వున్న నా దృష్టికి తీసుకుని వస్తే మా ఎమ్మెల్యే సహకారం తో సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తాను అని వారికి భరోసా ఇవ్వడం జరిగింది.ఇప్పటికీ గ్రామంలో ఎస్సి,ఎస్టీ కాలనీలలో సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది అలాగే త్రాగు నీరు సమస్య అయినా,వీధి దీపాలు సమస్య అయినా ఎస్సి,ఎస్టీ ల జీవన ఉపాధికి సంబంధించిన ఏ సమస్యనైనా నా దృష్టికి తీసుకుని వస్తే రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాను మా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో అని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,విఆర్వో, ఐసీడిఎస్ సిబ్బంది మరియు మండల అధికారులు పాల్గొన్నారు.




