📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ-సోమిరెడ్డి.

తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ-సోమిరెడ్డి.

📰 Generate e-Paper Clip

తోటపల్లి గూడూరు ఉద్యమ వార్త మార్చి 29.

తోటపల్లి గూడూరు మండలంలో ఆదివారం ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్తపాళెంలో,సౌత్ ఆములూరు, విలుకానిపల్లి పంచాయతీలలో పార్టీ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు కొత్తపాళెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్న వారికి వస్త్రాలు సమర్పించి సత్కారం చేశారు సీనియర్ కార్యకర్తలు, నేతలతో కలసి సహపంక్తి భోజనం చేయడంతో పాటు అందరితో ప్రతిజ్ఞ చేయించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషబరిత వాతావరణంలో జరుపుకుంటున్నాం
44 ఏళ్లుగా ఒకే పార్టీలో కొనసాగడాన్ని గర్వంగా భావిస్తున్నాను
గెలిచినా,ఓడినా, రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులకు గురైనా పార్టీ విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు నందమూరి తారక రామారావు సృష్టించిన పార్టీ తెలుగుదేశం సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆరే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు పేదలకు కూడు, గూడు,గుడ్డ నినాదంతో పార్టీ పెట్టిన ఆయన ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు సామాజిక పింఛన్, రేషన్ కార్డు,పక్కా ఇల్లు,మహిళలకు ఆస్తిలో సమాన హక్కు,మండలాల వ్యవస్థ ఏర్పాటు, సింగిల్ విండ్(పీఏసీఎస్) సిస్టమ్ లను అమలులోకి తేవడంతో పాటు పటేల్,పట్వారీ వ్యవస్థలను రద్దు చేసిన మహానుభావుడు పేద ప్రజల సంక్షేమం కొసం తొలిసారి ఆలోచన చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అంతకు ముందు ఎవరూ ఆ ఆలోచన చేయలేకపోయారు
రైతులకు వడ్డీ రాయితీలు ప్రకటించడంతో పాటు హార్స్ పవర్ కరెంట్ కు ఏడాదికి కేవలం రూ.50 మాత్రమే వసూలు చేసే విధానం తెచ్చి అన్నదాతకు అండగా నిలిచారు తిరుమలలో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా టీడీపీ హయాంలోనే నెల్లూరు జిల్లాకు వరమైన 146 టీఎంసీల సామర్ధ్యం కలిగిన సోమశిల,కండలేరు జలాశయాలు కూడా ఎన్టీఆర్ పుణ్యమే
ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో యువనేత నారా లోకేష్ బాబు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు నాలుగు దశాబ్ధాల తెలుగుదేశం పార్టీలో మూడు తరాల నేతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను మూడు సార్లు మంత్రిగా నాకు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది రాష్ట్రంలో రైతులు, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం అధికారంలో ఉంటే అభివృద్ధి కోసం ఆరాటపడతాం ప్రతిపక్షంలో ఉంటే పోరాడతాం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జాతరలా సాగుతోంది ప్రభుత్వ భూములను దోచుకోవడం,అక్రమ టోల్ గేట్లు తెరవడం, పంచభూతాలను మాయం చేయడం మాకు అలవాటు లేదు అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular