📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్సునీల్ కుమార్ చేతుల మీదుగా కోటలో ఘనంగా రంజాన్ తోఫా.

సునీల్ కుమార్ చేతుల మీదుగా కోటలో ఘనంగా రంజాన్ తోఫా.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమవార్త మార్చి 19.

కోట పట్టణంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చేతుల మీదుగా రంజాన్ తోఫా కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కోట,వాకాడు,చిట్టమూరు,చిల్లకూరు మండలాల పరిధిలో సుమారు 600 మందికి కుటుంబాలకు రంజాన్ తోఫా అందించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ మా తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ సారధ్యంలో 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే ఈ ప్రాంతంలోని ప్రతి పేద ముస్లిం కుటుంబం రంజాన్ పండుగ జరుపుకోవాలని జలీల్ ఈ బహుత్తర కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని 600 కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం అంటే మామూలు విషయం కాదు రాష్ట్రంలోని ముస్లింలు అందరికీ ఒక ఆదర్శప్రాయుడు అని ఇటువంటి మంచి మనసున్న కొడుకును కన్నందుకు జలీల్ తల్లిదండ్రులకు ధన్యవాదాలు అన్నారు పార్టీలకు సంబంధం లేకుండా పేద ప్రజలే లక్ష్యంగా ఆయన పని చేస్తుంటారని కోట పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు ఆయన సారథ్యంలో జరుగుతున్నాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు కూడా ఎంతో కష్టపడి కార్యక్రమాలు చేస్తుంటారని తెలిపారు కరోనా వచ్చిన సందర్భంలో ఈ చుట్టుపక్క ప్రాంతాల్లోనే ఎంతోమంది కరోనా పేషెంట్లను హాస్పిటల్లో చేర్పించేందుకు జలీల్ సాయం చేశారని అలాగే ఎలాంటి పకృతి విపత్తులు వచ్చిన ప్రజలకు సహాయం చేసేందుకు ముందుండే వ్యక్తి జలీల్ అహ్మద్ అని ఎమ్మెల్యే తెలిపారు ఇలాంటి మంచి వ్యక్తికి దేవుడు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అలాగే కార్యక్రమానికి విచ్చేసిన కోట,వాకాడు, చిట్టమూరు,చిల్లకూరు మండలాల ముస్లిం సోదర సోదరీమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,మాజీ అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి,జిల్లా రైతు విభాగం కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి,వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్,వాకా విజయభాస్కర్ రెడ్డి మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కోటారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి డా,,తిరుమల శెట్టి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు శంషుద్దీన్,దారా సురేష్,నౌషాద్ భాషా,కోట మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మధుబాబు,నాయబ్ రసూల్,అక్బర్ బాష, సిద్దపరెడ్డి పోలమ్మ,సుహాసిని,వంశీ,చాపల శ్రీనివాసులు, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular