📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ వారి చీర,సారె అందించిన సునీల్ కుమార్.

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ వారి చీర,సారె అందించిన సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

చిల్లకూరు, ఉద్యమ వార్త మార్చి 12

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామం నందు వెలసియున్న శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి సారే అందించి, దర్శించుకుని అమ్మవారి కరుణ కటాక్షాలు నియోజకవర్గం ప్రజలపై ఉండాలని కోరుకున్న డాక్టర్ పాశిం సునీల్ కుమార్
శాసన సభ్యులు బుధవారం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర మంగళవారం నుంచి ప్రారంభమైన సందర్భంగా అమ్మవారికి చీర సారే ఇవ్వడం జరిగిందని తెలిపారు అలాగే ఈ జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారని ఎంతో మహిమగల తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు తీసుకున్నారని ఆయన చెప్పారు అమ్మవారి జాతర మహోత్సవానికి విచ్చేసిన మరియు విచ్చేస్తున్న భక్తులకు అభినందనలు తెలిపారు అలాగే అధికారులకు కమిటీ సభ్యులకు జాతర మహోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో తూర్పు కనుమలు ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ దశధర రామిరెడ్డి మరియు కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular