📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మహిళాభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

మహిళాభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

సర్వేపల్లి మనుబోలు,ఉద్యమ వార్త మార్చి 8.

మనుబోలు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి దృష్టి సారిస్తామని ఆడపడుచుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సర్వేపల్లిలో మహిళల కోసం ప్రత్యేకంగా రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రేపటి నుంచి 8,9 తరగతుల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు మనుబోలులో ఘనంగా నిర్వహించ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో
మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆడపడుచులు భారీగా తరలివచ్చరని
అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న చిన్నారి అనిత్ ను ప్రత్యేకంగా సోమిరెడ్డి అభినందించరు అనంతరం ఆయన మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మహిళలకు పలు రంగాల్లో ప్రత్యేక గుర్తింపు లభించిందని
నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిహక్కుతో పాటు రిజర్వేషన్ అవకాశాలు కల్పించారని చంద్రబాబు నాయుడు పొదుపు లక్ష్మి గ్రూపుల పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని మహిళల ఆర్థికాభివృద్ధికి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారని తెలిపారు పొదుపు మహిళలకు ఇచ్చే రుణాలను ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని
కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల కోసం చరిత్రలో నిలిచిపోయేలా పథకాలు అమలు చేస్తున్నామని
స్త్రీశక్తి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించామని
ఈ పథకానికి ఆడపడుచుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు
దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని
తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని
10 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ఈ పథకం ద్వారా బడికి వచ్చే పిల్లల సంఖ్య పెరగడం శుభపరిణామమని
ద్రౌపదీ ముర్ము, రేఖాగుప్తా, మమతా బెనర్జీ, సునేత్ర పవార్ వంటి వారు కీలకపదవుల్లో రాణిస్తూ మహిళా మూర్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారని
పెద్దపెద్ద కంపెనీలకు సీఈఓలు,చైర్ పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు
సర్వేపల్లి నియోజకవర్గంలోనూ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు
సీఎస్ఆర్ నిధులతో మహిళల ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం
కృష్ణపట్నంలోని తుఫాన్ షెల్టర్ లో ఆదానీ ఫౌండేషన్ సహకారంతో మహిళలకు కుట్టుశిక్షణ కార్యక్రమం జరుగుతోంది
కసుమూరులోనూ ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అబ్దుల్ అజీజ్ సహకారంతో కుట్టు శిక్షణ ప్రారంభించాం
త్వరలో కంప్యూటర్ శిక్షణ తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయి
SEIL కంపెనీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో 8,9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయబోతున్నాం
యువగళం స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఐదు మండలాల్లో సైకిళ్లు విద్యార్థినులకు అందజేయబోతున్నామని గిరిజన బిడ్డలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం కాలనీల్లో అవసరమైన వసతులు కల్పించడంతో పాటు ప్రతి బిడ్డ బడికి వచ్చేలా కృషి చేస్తున్నామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular