udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 12:15 am Digital Edition : UDYAMA VAARTHA

గండవరం వద్ద దారుణం: ఇద్దరిపై కత్తి దాడి – ఇద్దరూ మృతి.

కొడవలూరు,ఉద్యమ వార్త మార్చ్:30

కొడవలూరు మండలం గంగవరం పెద్దపుటేరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వ్యవసాయ పనుల కోసం గడ్డి మిషన్‌కు డీజిల్ తీసుకుని వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
పెద్దపుద్దేడు గ్రామానికి చెందిన వెంకటేష్,సంగం మండలం వెంగరెడ్డి పాలెంకు చెందిన బాల వెంకయ్య ఇద్దరూ బైక్‌పై కొడవలూరు మండలం గండవరం నుండి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈదాడి లో ఇద్దురు చనిపోవడం తో అ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.