udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 5:25 am Digital Edition : UDYAMA VAARTHA

5 మండలాల ఎస్టీల తో ప్రజాదర్బార్ నిర్వహించిన-సునీల్ కుమార్.

కోట ఉద్యమ వార్త మార్చి 31

కోట మండల కేంద్రంలోని షాది మంజిల్ లో మంగళవారం గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎస్టి ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఏఆర్టి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో ఎస్టీలు మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కోట మండల తాసిల్దార్ జె జె రావు ఎంపీడీవో నాయక్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఆర్టి సంస్థ బషీర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్టీ కులాలకు సంబంధించి అవసరమైన సంక్షేమ పథకాలు రోడ్లు తదితర అంశాలపై గౌరవ ఎమ్మెల్యే గారికి అధికారులకు తెలియచెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమా నీకి పిలవగానే హాజరైనందుకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏఆర్టి సంస్థ ఎంతో చురుగ్గా పనిచేస్తుందని నా నియోజకవర్గంలో ఎస్టి కులాల వారు క్షేమంగా ఉండాలని వారి కోసం ఏదైనా చేస్తానని అధికారులు నాయకులు సంక్షేమం అభివృద్ధి ఏదైనా ముందుగా వారికి అందించాలని వారి గ్రామాల్లో తాగునీరు రోడ్డు పక్క గృహాలు వారికి అవసరమైన రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తదితర ఏమి అవసరం ఉన్నా ముందుగా వారికే చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి వందలాది మంది ప్రజలు పాల్గొని గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారికి వినతి పత్రాలు అందించారు స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు లబ్ధిదారులు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి,జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్,శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దశధర రామిరెడ్డి,మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,వాకా విజయభాస్కర్ రెడ్డి, పి ఏ సి యస్ అధ్యక్షులు రవి రెడ్డి,సోషల్ మీడియా అధ్యక్షులు మధుబాబు,టీడీపీ సీనియర్ నాయకులు నౌషాద్ భాష,మండల యువత అధ్యక్షులు చల్ల సురేష్ బాబు, జిల్లా మహిళా కార్యదర్శి సిద్ధపరెడ్డి పోలమ్మ,నియోజకవర్గ నాయకులు కర్లపూడి కోటేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మురళి, బూత్ ఇంచార్జి నాగేంద్రబాబు,సిద్దవరం సర్పంచ్ రామయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.