గూడూరు ఉద్యమ వార్త మార్చి 13.
గూడూరు పట్టణం:- అన్నదాత సుఖీభవ -PM కిసాన్ 3వ విడత విడుదల కార్యక్రమం లో భాగంగా శుక్రవారం షాది మంజిల్ నందు రైతులతో సమావేశం లో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ ద్వారా 22 వేల 217 కుటుంభాలకు 12 కోట్ల 54 లక్షల 94 వేల రూపాయలు అందిస్తున్నాం అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో ఒక్కోటి అమలు చేస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు 20 వేలు అందిస్తామని చెప్పాము. మొదటి విడత లో భాగంగా 7000 వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేసాం.రెండో విడత లో భాగంగా రాష్ట్ర ప్రభుతం 5000 వేలు,కేంద్ర ప్రభుత్వం 2000 వేలు రూపాయలు
జమ చేసాం. 3వ విడత లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 4000 వేలు,కేంద్ర ప్రభుత్వం 2000 వేల రూపాయలు రైతులకు ఇస్తున్నాం అన్నారు.గూడూరు
మండలం లో 5,188 మందికి గాను 2 కోట్ల 86 లక్షలు అందిస్తున్నాం. చిల్లకూరు మండలం లో 4,591 మందికి గాను, 2 కోట్ల 62 లక్షలు అందిస్తున్నాం కోట మండలంలో 3,745 మందికి గాను 2 కోట్ల 12 లక్షలు అందిస్తున్నాం.వాకాడు మండలంలో 3,795 మందికి గాను, 2 కోట్ల 11 లక్షలు అందిస్తున్నాం. చిట్టమూరు మండలం లో 4,898 మందికి గాను,2 కోట్ల 84 లక్షలు అందిస్తున్నాం. మొత్తం నియోజకవర్గం నందు 22,217 కుటుంబాలకు గాను 12 కోట్ల 54 లక్షల 94 వేలు అందిస్తున్నాం. అని సునీల్ కుమార్ అన్నారు.
చెప్పున మాట ప్రకారం ఒక్కో పథకం అమలు చేస్తున్నాం అన్నారు.
గత ప్రభుత్వం లాగ మాది మాటల ప్రభుత్వం కాదు,చేతల ప్రభుత్వం అని అన్నారు. నియోజకవర్గంలో38 లక్షల 25 వేల రూపాయల సబ్సిడీతో 226 వ్యవసాయ పని ముట్లను అందించాము. 24 లక్షల 50 వేల రూపాయల సబ్సిడీతో 5 డ్రోన్ లను అందించాము. నియోజకవర్గంలో 61,896 ఎకరాల
సాగుకు 12,404 టన్నుల యూరియాను అందించామని అన్నారు.దిత్వా తుఫాను కారణంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న రైతులకు 80% సబ్సిడీతొ 4343 రైతులకు 3 టన్నుల వరి విత్తనాలను అందించామని సునీల్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.