udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 10:28 am Digital Edition : UDYAMA VAARTHA

28వ డివిజన్లో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నెల్లూరు ఉద్యమ వార్త మార్చి 29

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 28వ డివిజనులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 28వ డివిజన్లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించామని తెలిపారు అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు1982మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించారని పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి పేదవారికి కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేసి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను స్థాపించి మహిళలకు సమాన హక్కు కల్పించి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు ఎన్టీ రామారావు అని ఆమె తెలిపారు అదే ఆశయంతో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా క్షేమమే లక్ష్యంగా 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు వారందరూ సగర్వంగా తలెత్తుకొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారని ఆమె తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆమె తెలిపారు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆమె అన్నారు ఈరోజు వాడ వాడల తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారని ఇది తెలుగు వారందరికీ ఒక పండుగ లాంటిదని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.