udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 12:17 am Digital Edition : UDYAMA VAARTHA

10 లక్షలతో C C రోడ్లకు శంకుస్థాపన- సర్పంచ్ మధుయాదవ్

కోట ఉద్యమ వార్త మార్చి 9

మండల కేంద్రంలోని వెంకన్నపాలెం పంచాయతీ లో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు వెంకన్నపాలెం ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయలతో సి సి రోడ్లకు శంకుస్థాపన చేశామని వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ నిరంతరం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, పనబాక వెంకయ్య, కడివేటి నవీన్, బత్తల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.