కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 13.
తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు కిరణ్ తండ్రి గారైన గూడూరు రాజయ్య(66)ఆదివారం స్వర్గస్థులైనారు.ఈ సందర్భంగా కోట లో ఆయన స్వగృహంలో గూడూరు రాజయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఎంతో మంచివారు,మృదుస్వభావి కోట లో అందరికి సుపరిచితులు కీర్తిశేషులు గూడూరు రాజయ్య ఆకస్మిక మరణం బాధాకరం అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మనో ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు గూడూరు కిరణ్ వారి అన్నయ్యలు గూడూరు రాంబాబు, గూడూరు కృష్ణ కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాం అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మరియు ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్,శంషుద్దీన్,కోటమండలం ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,మైనార్టీ నాయకులు నౌసాద్ బాష తదితరులు పాల్గొన్నారు.