చిట్టమూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 14.
చిట్టమూరు మండల పరిధిలోని సోము సముద్రం అగ్రహారం గ్రామంలో సోమవారం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్టమూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు,ప్రముఖ పత్రిక విలేకరి ఎంబేటి పోలయ్య పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేకును కట్ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి భారత జాతి గర్వించే మహనీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రాంతాలకు,కులాలకు మతాలకు అతీతంగా అందరు ఒకే తాటిపై నడిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని అంతే కాక భారతీయ న్యాయవాదిగా,ఆర్థిక శాస్త్రవేత్తగా,రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా ఆయన అందరికీ కావలసిన రాజ్య నిర్మాతగా ఆయన సేవలు మరువలేమని ఆయన అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని అలాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు అన్నారు.అనంతరం ముగ్గులు పోటీలు,క్రికెట్,ఆటల పోటీలలో గెలుపొందిన వాళ్లకు బహుమతి ప్రదానం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సోముసముద్రం అంబేద్కర్ యువత,గ్రామస్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.