udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 9:35 pm Digital Edition : UDYAMA VAARTHA

సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినం-ఎంపిడిఓ.

తోటపల్లి గూడూరు,ఉద్యమ వార్త; ఏప్రిల్ 9.

తోటపల్లి గూడూరు మండలం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణ లో ఈరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు సర్వేపల్లి శాసన సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించబడునని తోటపల్లి గూడూరు ఎంపిడిఓ కోవి వేంకటేశ్వర రావు.కావున మండలం లోని ప్రజలందరూ ఈ అవకాశం వినియోగించుకొని తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీల రూపంలో తెలియచేయవలసిందిగా ఆయన కోరడమైనది.అందరూ ప్రజా ప్రతినిధులు,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు,పంచాయతీ అభివృద్ధి అధికారులు మీ గ్రామాల పరిధిలో ప్రజలందరికీ తెలియచేసి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరడమైనదని ఎంపిడిఓ
కోవి వేంకటేశ్వర రావు తెలిపారు.