udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 2:14 am Digital Edition : UDYAMA VAARTHA

సిలువ మోసిన టీడీపీ నేత నాగేంద్రబాబు.

తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 3 ఉద్యమ వార్త.

తోటపల్లి గూడూరు మండలంలోని ఫాతిమా మాత పుణ్యక్షేత్రంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సహాయ గురువులు ఫాదర్ గుడిపల్లి దైవ సహాయం ఆదేశానుసారం గూడూరు నుండి కామాక్షి నగర్ ఫాతిమా మాత చర్చివరకు సిలువ మార్గం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సిలువ మోసుకుంటూ ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంల మండల తెలుగుదేశం నేతలు, సోమిరెడ్డి అభిమానులుకమతం నాగేంద్రబాబు, ఇంగిలాల విశ్వేశ్వర్ పాల్గొని సిలువ మోశారు. వారి పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఫాదర్ క్రీస్తు రమేష్ గుడ్ ఫ్రైడేవిశిష్టతను వివరించారు. గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు అని, ఆయన మనుషుల పాపాల విమోచన కోసం తన ప్రాణాలను అర్పించినత్యాగాన్ని స్మరించుకునే పవిత్ర దినమని తెలిపారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం, ప్రార్థనలు, సిలువ మార్గం ద్వారా ఆత్యాగాన్ని గుర్తుచేసుకుంటారని చెప్పారు.
విచారణ గురువులు గుడిపల్లి దైవ సహాయం, క్రీస్తు రమేష్ తదితర ఫాదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాంతి, సామరస్యానికి సంకేతంగా ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారు.గుడ్ ఫ్రైడే సందర్భంగాగ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంనెలకొంది.