udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 8:48 pm Digital Edition : UDYAMA VAARTHA

సర్వేపల్లి సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం-సోమిరెడ్డి

ముత్తుకూరు ఉద్యమ వార్త మార్చి 12

ముత్తుకూరు మండల కేంద్రంలో బుధవారం సైకిల్ పంపిణీ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు అలాగే సర్వేపల్లి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు సీఎస్ఆర్ ఫండ్ తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారుబాలికలను విద్యాపరంగా ప్రోత్సహించేలా సైకిళ్ల పంపిణీ చేపట్టామని
యువగళం స్ఫూర్తితో చేపట్టిన మా సంకల్పానికి SEIL కంపెనీ సాయం తోడైందని తెలిపారు.
ముత్తుకూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికిన విద్యార్థినులు, ముత్తుకూరు మండల టీడీపీ నేతలు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో సమూల మార్పులు తెస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు
లోకేష్ బాబు కృషికి తోడుగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం
ముత్తుకూరు మండలంలోని ఆరు హైస్కూళ్లలో 8,9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు 351 సైకిళ్లు అందజేశాం
SEIL కంపెనీ 1841 HERO సైకిళ్లను సీఎస్ఆర్ నిధులతో అందించింది లోకేష్ బాబు
యువగళం పాదయాత్ర సాగిన 3132 కిలోమీటర్లకు గుర్తుగా అన్ని సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం
మరో 1300
సైకిళ్లను కూడా సమకూర్చుకుని విద్యార్థులకు అందజేస్తాం
ప్రస్తుతం జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 8,9 తరగతులు చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తున్నాం
బాలికలు వివిధ కారణాలతో విద్యకు దూరమవుతూ డ్రాపవుట్లుగా మిగులుతున్నారని
వారిని స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహించేందుకు ఈ సైకిళ్లు కూడా కొంతమేర దోహదం చేస్తాయని
భావిస్తున్నానని సోమిరెడ్డి అన్నారు.
SEIL కంపెనీ విద్య, వైద్యపరంగానే కాకుండా పేదరిక నిర్మూలనకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం సంతోషం
ముత్తుకూరు హైస్కూలును బీపీసీఎల్ కంపెనీ సీఎస్ఆర్ నిధులు రూ.7 కోట్లతో ఆదర్శ పాఠశాలగా నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎస్ఆర్ నిధులు రూ.3.80 కోట్లతో వెంకటాచలం వద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించాలని కోరాంపరిశ్రమల ఏర్పాటు కోసం స్థానికంగా ఉండే ప్రజలు గ్రామాలను ఖాళీ చేయడంతో పాటు భూములు,ఇళ్లు కోల్పోయారు
కాలుష్యాన్ని కూడా మన ప్రజలే భరిస్తున్నారు
ప్రతి కంపెనీ తమ నికర ఆదాయంలో 2 శాతం సీఎస్ఆర్ నిధులుగా ఖర్చు చేయాలి ఆ నిధులను మన ప్రాంతంలోనే ఖర్చు చేయాలని వారిని కోరుతున్నాం వారు కూడా సానుకూలంగ స్పందిస్తున్నారు
కృష్ణపట్నం,
ముత్తుకూరు పంచాయతీలను అదానీ కృష్ణపట్నం పోర్టు దత్తత తీసుకుంది ముత్తుకూరులో స్పోర్ట్ స్టేడియం నిర్మించడంతో పాటు శ్మశానంలో వసతుల కల్పన,తదితరపనులు చేపడుతున్నారు
కృష్ణపట్నంలోని తుఫాన్ షెల్టర్ ను స్కిల్ డెవలప్మెంట్ సెంటరుగా మార్చి కుట్టుశిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా మిషన్లు అందిస్తున్నారు
పామాయిల్ కంపెనీలు 10 గిరిజన కాలనీలను దత్తత తీసుకుని వసతులు కల్పించడంతో
పాటు పేదల ఆర్థికాభ్యున్నతికి అవసరమైనచర్యలు తీసుకుంటున్నారు
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులను కూడాసద్వినియోగం చేసుకుని సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.