udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 8:15 pm Digital Edition : UDYAMA VAARTHA

సమస్త మానవాళికి రంజాన్ శుభాకాంక్షలు-జలీల్ అహ్మద్

కోట ఉద్యమవార్త మార్చి 20.

ప్రపంచ శాంతిని కోరుకునే పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా సమస్త మానవాళికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ అన్నారు ప్రపంచ శాంతి కోరుకునే ఇస్లాం మతం పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోని ప్రతి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అలాగే ఈ పర్వదినాన్ని బాగా జరుపుకోవాలని వారికి వారి కుటుంబాలకి సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని”అల్లా”ను ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు రంజాన్ పర్వదినాన్ని ప్రతి పేద ముస్లిం కుటుంబం ఘనంగా జరుపుకోవాలని సదుద్దేశంతో గురువారం కోట,వాకాడు,చిట్టమూరు,చిల్లకూరు మండలాల 600 ముస్లిం కుటుంబాలకు గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందించమని గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమం మాకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు.