udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 3:29 am Digital Edition : UDYAMA VAARTHA

శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు.

కోట ఉద్యమ వార్త
మార్చి 10.

కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి భక్తులు విశేషంగా అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి పొంగలి పెట్టుకొని మొక్కులు చెల్లించుకున్నారు కోట పరిసర ప్రాంతాలు కాకుండా రాష్ట్రాల్లో కూడా విశేష పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీ శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం విశేష ప్రజాదరణతో ఆశేష భక్తులతో నిత్యం పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిలా ప్రజలలో ప్రత్యేక స్థానం నెలకొని ఉంది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆదివారం మంగళవారం శుక్రవారం కోట మండలం చిట్టమూరు మండలం వాకాడ మండలం తదితర ప్రాంతాల నుంచి అలాగే తమిళనాడు తెలంగాణ నుంచి కూడా విశేషంగా భక్తులు అమ్మవారి కోర్కెలు తెచ్చేందుకు వస్తుంటారు శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో వైష్ణవి దేవి ఆలయం పరమశివుని ఆలయం ఉండడంతో ప్రత్యేక ఆకర్షణతో ఈ ఆలయ ప్రాంగణం ప్రత్యేకత సంతరించుకుంది.