పొదలకూరు ఉద్యమ వార్త మార్చి 31.
వైసీపీ పాలనలో కాకాణి కక్ష కట్టి అడ్డుకున్న పనులన్నీ పూర్తి చేస్తానాని సర్వేపల్లి సమగ్ర అభివృద్ధే మా ఆకాంక్ష అని సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయనస్వచ్చ అంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పొదలకూరులో 37 స్వచ్ఛ రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్ణీత ప్రదేశంలోనే వేయాలికూటమి ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది తల్లికి వందనం పథకంతో గిరిజనుల్లో బడికి వెళ్లే బిడ్డల సంఖ్య పెరిగింది గత వైసీపీ పాలనలో ఒక్క బిడ్డకే అమ్మ ఒడి పరిమితం చేశారు మన ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా ఎంత మంది బిడ్డలుంటే అందరికీ ప్రయోజనం కలిగిస్తున్నాం మన జిల్లాలో గిరిజనులు చాలా మంది చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు.చల్లా యానాదుల పరిస్థితి మరీ దారుణం ఈ సమస్యను ఇటీవల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర పథకాలను నెల్లూరు మైదాన ప్రాంతంలోని గిరిజనుల కోసం కూడా అమలు చేయాలని కోరానువచ్చే నెలలో జరిగే ఎస్టీ కమిషన్ సమావేశం నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు సీఎస్ఆర్ నిధులతో పొదలకూరు మండలంలోనూ అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం పొదలకూరు మండలానికి చేసేందేమీ లేకపోగా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక పనులను వైసీపీ పాలనలో కాకాణి అర్థంతరంగా నిలిపేశాడు కాకాణి అడ్డుకున్న పనులన్నింటిని పూర్తి చేస్తాంత్వరలోనే అదానీ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మెగా వాటర్ ప్లాంటు,తోడేరు స్టేడియంను పరిశీలిస్తాం
అదానీ ఫౌండేషన్ సహకారంతో మెగా వాటర్ ప్లాంటును పునరుద్ధరించే ప్రయత్నంలో ఉన్నాం సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం గంటా రమణయ్య సొంత నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చివున్నారు 18 ఆర్ కాలువ పనుల బాధ్యత కూడా మాపైనే ఉంది మనుబోలు రైతుల చిరకాల స్వప్నం డేగపూడి – బండేపల్లి కాలువ పనులు కూడా పూర్తి చేయిస్తాం అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.