udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 2:46 am Digital Edition : UDYAMA VAARTHA

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్-జలీల్ అహ్మద్.

కోట ఉద్యమ వార్త; ఏప్రిల్ 26.

కోట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్లో ఆదివారం కోట రోటరీ క్లబ్ అద్వర్యం లో చలివేంద్రం ప్రాంభించారు.కోట మండల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్ దాతృత్యం తో ప్రారంభించిన చలివేంద్రం లో తొలిరోజు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేజర్ పంచాయతీ అయిన కోట లో వివిధ రకాల పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు వారి దాహార్తిని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిరవధికoగా జరుగుతుంటాయి అందులో భాగంగానే మండు వేసవిని దృష్టిలో పెట్టుకొని ఈ చలివేంద్రం ఏర్పాట్లు చేస్తున్నాం అని త్వరలోనే కోట లో కొన్ని ప్రధాన కూడళ్లలో చలివేంద్రం ఏర్పాట్లు చేస్తామని జలీల్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ జమ్మి ప్రసాద్,కిషోర్, సభ్యులు శంశుద్దిన్,నౌసాద్ బాష తదితరులు పాల్గొననున్నారు.